గంటవానిపాలెంలో వృద్ధుడు సజీవ దహనం

ABN , First Publish Date - 2020-11-26T05:39:01+05:30 IST

మండలంలోని గంటవానిపాలెంలో పశువుల పాక దగ్ధమైన ఘటనలో ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు.

గంటవానిపాలెంలో వృద్ధుడు సజీవ దహనం
గుర్రాల బెన్నయ్య (ఫైల్‌ ఫొటో)

  పశువులపాక కాలిపోవడంతో అందులో నిద్రిస్తుండగా ఘటన

మునగపాక, నవంబరు 25 : మండలంలోని గంటవానిపాలెంలో పశువుల పాక దగ్ధమైన ఘటనలో ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలివి. గంటవానిపాలేనికి చెందిన గుర్రాల బెన్నయ్య (63) మంగళవారం రాత్రి భోజనానంతరం ఎప్పటిలాగే పశువుల పాకలో పడుకున్నారు. సుమారు రాత్రి రెండు గంటల సమయంలో పశువుల పాక దగ్ధం కావడంతో బెన్నయ్య కూడా మృతిచెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. 

Updated Date - 2020-11-26T05:39:01+05:30 IST