వైభవంగా గౌరీపరమేశ్వరుల అనుపు మహోత్సవం

ABN , First Publish Date - 2020-12-06T05:47:21+05:30 IST

గౌరీ సేవాసంఘం ఆధ్వర్యంలో నాతయ్యపాలెంలో నిర్వహిస్తున్న గౌరీ పరమేశ్వర మహోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి

వైభవంగా గౌరీపరమేశ్వరుల అనుపు మహోత్సవం
నాతయ్యపాలెంలో గౌరీపరమేశ్వరులను ఊరేగిస్తున్న భక్తులు

అక్కిరెడ్డిపాలెం: గౌరీ సేవాసంఘం ఆధ్వర్యంలో నాతయ్యపాలెంలో నిర్వహిస్తున్న గౌరీ పరమేశ్వర మహోత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. అనుపు మహోత్సవం సందర్బంగా గౌరీపరమేశ్వరులను మేళ తాళాలతో అక్కిరెడ్డిపాలెం, నాతయ్యపాలెం కాలనీల్లో పెద్ద ఎత్తున ఊరేగించి, ప్రత్యేక పూజలు చేశారు.ఈ ఉత్సవాలలో సంఘం అధ్యక్షుడు దాడి వెంకటరమేశ్‌, కె. జగ్గ అప్పారావు, ఎల్లపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T05:47:21+05:30 IST