యూరియా కోసం తోపులాట

ABN , First Publish Date - 2020-09-01T07:21:45+05:30 IST

స్థానిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా విక్రయం సందర్భంగా సోమవారం రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొం

యూరియా కోసం తోపులాట

యూరియా కోసం తోపులాట

కొంతమంది రైతులకు స్వల్పగాయాలు

పంపిణీని నిలిపేసిన సొసైటీ సిబ్బంది


దేవరాపల్లి, ఆగస్టు 31:  స్థానిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా విక్రయం సందర్భంగా సోమవారం రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది రైతులకు గాయాలయ్యాయి. సోమవారం ఉదయం ఆరు గంటలకే సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. రైతులు అధిక సంఖ్యలో రావడంతో ఎరువులు ముందు ఉన్న వారికే దక్కుతాయని, తమకు అందవని రైతులంతా ముందుకు దూసుకు వెళ్లారు. దీంతో కొంతమంది రైతులకు దెబ్బలు తగిలాయి. వచ్చిన రైతులను పీఏసీఎస్‌ సిబ్బంది అదుపు చేయలేక యూరియా పంపిణీ నిలుపుదల చేశారు.


అనంతరం పోలీసు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సొసైటీ సీఈవో కనకారావు మాట్లాడుతూ, తమ వద్ద 400 యూరియా బస్తాలు ఉన్నాయని, రైతులందరూ సంయమనం పాటించకపోతే తాము ఏమీ చేయలేమన్నారు. ఎరువులు అయిపోతే మరల తెప్పిస్తామన్నారు.


సీపీఎం ఆందోళన

రైతులందరికీ ఎరువులు పంపిణీ చేయాలంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు డి.వెంకన్న ఆందోళన చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్నీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులకు గాయాలు పాలు చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు ఎరువులు ఇవ్వని రైతు భరోసా కేంద్రాలు ఎందుకని ఆయన దుయ్యబట్టారు.


Updated Date - 2020-09-01T07:21:45+05:30 IST