కొవిడ్ పరీక్ష చేయించుకుంటే.. ఎక్కడ పాజిటివ్ వస్తుందోనన్న భయంతో..
ABN , First Publish Date - 2020-08-16T14:12:09+05:30 IST
పట్టణంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి..

అనకాపల్లి టౌన్(విశాఖపట్నం): పట్టణంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ ఎల్.రామకృష్ణ కథనం ప్రకారం వివరాలివి. ఉప్పలవారి వీధికి చెందిన ఎల్.అనురాధ (35) దువ్వాడలోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కొవిడ్ పరీక్ష చేయించుకుంటే ఎక్కడ పాజిటివ్ వస్తుందోనన్న భయంతో శుక్రవారం సాయంత్రం ఇంటి మేడపై గదిలోకి వెళ్లి ఉరుపోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. మృతురాలి సోదరుడు నరసింహారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇదిలావుంటే, మృతదేహానికి వైద్యాలయంలో కొవిడ్ పరీక్ష నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్టు ఎస్‌ఐ వివరించారు.