రైతు అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-11-27T05:55:52+05:30 IST

రైతు అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. గురువారం స్థానిక కో-ఆపరేటివ్‌ సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

రైతు అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బూడి


ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు

మాడుగుల, నవంబరు 26: రైతు అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు అన్నారు. గురువారం స్థానిక కో-ఆపరేటివ్‌ సొసైటీ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర అందించడం జరుగుతుందన్నారు. వర్షాలకు కోత కోసిన వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి నష్టాన్ని పూడ్చివేసేలా తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పర్సన్‌ఇన్‌చార్జి బసవా రామపరమేశ్‌, కార్యదర్శి బోరా ఈశ్వరరావు, వైసీపీ నాయకులు వేమవరపు రామధర్మజ, తదితరులు పాల్గొన్నారు. 

Read more