శారదా నదిలో పడి రైతు మృతి

ABN , First Publish Date - 2020-11-13T06:13:33+05:30 IST

మండలంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన రైతు డి.వెంకటరమణ (50) గురువారం శారదానదిలో పడి మృతి చెందినట్టు రూరల్‌ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

శారదా నదిలో పడి రైతు మృతి

కొత్తూరు, నవంబరు 12: మండలంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన రైతు డి.వెంకటరమణ (50) గురువారం శారదానదిలో పడి మృతి చెందినట్టు రూరల్‌ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోజూ మాదిరిగానే గురువారం తెల్లవారుజామున శారదా నదికి వెళ్లిన వెంకటరమణ, ఎంత సమయమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుమారుడు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడని చెప్పారు. మృతుడి భార్య అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-11-13T06:13:33+05:30 IST