గ్రూప్-3 అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలన
ABN , First Publish Date - 2020-08-11T09:54:15+05:30 IST
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో గ్రూప్-3 కేడర్లో పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నిర్వహించిన పరీక్షలలో ఎంపికైన అభ్యర్థుల ..

విశాఖపట్నం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018లో గ్రూప్-3 కేడర్లో పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నిర్వహించిన పరీక్షలలో ఎంపికైన అభ్యర్థుల నిరీక్షణ ఫలించింది. పరీక్ష ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరి 11న విడుదలయ్యాయి. విశాఖ జిల్లా నుంచి 104 ఖాళీలకు అభ్యర్థులను ఎంపికచేశారు. అయితే కొవిడ్ ప్రభావంతో అప్పటి నుంచి అభ్యర్థుల పోస్టింగ్ నిలిచిపోయింది. అభ్యర్థులు పలుమార్లు జిల్లా యంత్రాంగానికి చేసిన వినతి మేరకు ఽధ్రువపత్రాల పరిశీలన అనంతరం పోస్టింగ్ కోసం కౌన్సెలింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో డీపీవో వి.కృష్ణకుమారి నేతృత్వంలో ఏవో మూర్తి తదితరులు నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 93 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ వారంలో కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తామని డీపీవో తెలిపారు.