-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Ex minister Dhaadi says Distance to New Year celebrations
-
నూతన సంవత్సర వేడుకలకు దూరం
ABN , First Publish Date - 2020-12-30T05:36:34+05:30 IST
నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తెలిపారు.

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు
అనకాపల్లి టౌన్, డిసెంబరు 29: నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తెలిపారు. ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 31 వరకు ఆంక్షలను పొడిగించిందన్నారు. అందువల్ల వైసీపీ కార్యకర్తలు, మిత్రులు, శ్రేయాభిలాషులు, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడకుండా ఈ వేడుకలకు దూరంగా ఉండడం మంచిదని ఆశిస్తున్నానన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడం హర్షణీయమన్నారు.