సీఎం దృష్టికి నాగవంశీయుల కార్పొరేషన్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-09-03T07:05:27+05:30 IST

ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీలలో వెనుకబడిన నాగవంశీయులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు అంశాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ వి

సీఎం దృష్టికి నాగవంశీయుల కార్పొరేషన్‌ ఏర్పాటు

ఎంపీ విజయసాయిరెడ్డి

పద్మనాభం, సెప్టెంబరు 2: ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీలలో వెనుకబడిన నాగవంశీయులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు అంశాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పద్మనాభంలో బుధవారం వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభం, వైఎస్‌ రాజ శేఖరరెడ్డి వర్ధంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు.


నాగవంశీయులతో పాటు, మత్స్యకారులలో ఒక కులం వారు తమకు ప్రత్యేక కార్పొరేషన్లు కావాలని కోరుతున్నందున ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, వీటిని ఏర్పాటు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ పాండ్రంగి వంతెన నిర్మాణానికి సీఎం ఆమోదం లభించిందని, నిదులు మంజూరైన వెంటనే శంకుస్థాపన చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ నాయకులు కె.రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.గిరిబాబు, కె.లక్ష్మణ్‌, అముజూరు అప్పారావు, ఎం.వెంకటరావు, ఎం.అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-03T07:05:27+05:30 IST