షిఫ్ట్‌ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-12T04:37:32+05:30 IST

పాడేరు డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న 46 మంది షిఫ్ట్‌ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు స్పష్టం చేశారు.

షిఫ్ట్‌ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆందోళన చేస్తున్న షిఫ్ట్‌ ఆపరేటర్లు


సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు

పాడేరురూరల్‌, డిసెంబరు 11: పాడేరు డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న 46 మంది షిఫ్ట్‌ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఈపీడీసీఎల్‌ డివిజన్‌ కార్యాలయం ఎదుట షిఫ్ట్‌ ఆపరేటర్లు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ.. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తున్న 46 మంది నుంచి ఈఎండీ డిపాజిట్‌ పేరుతో రూ.8 లక్షలు వసూలు చేసిన కాంట్రాక్టర్‌ గడువు ముగిసినా నేటికీ చెల్లించలేదన్నారు. అలాగే ఈ ఏడాది జూన్‌ నెల వేతనాలను కాంట్రాక్టర్‌ నేటికీ చెల్లించలేదన్నారు. ఈ విషయమై విద్యుత్‌ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు.  అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్‌ కార్మికులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 

Updated Date - 2020-12-12T04:37:32+05:30 IST