-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » epdcl poster
-
విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
ABN , First Publish Date - 2020-12-15T05:51:11+05:30 IST
విద్యుత్‌ను పొదుపు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా కార్పొరేట్ కార్యాలయంలో విద్యుత్ పొదుపుపై పోస్టర్‌ను ఆవిష్కరించారు

ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి
విశాఖపట్నం, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ను పొదుపు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి సెల్వరాజన్ పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా కార్పొరేట్ కార్యాలయంలో విద్యుత్ పొదుపుపై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా విద్యుత్ వినియోగం బాగా తగ్గించవచ్చునని, వీటిపై ప్రతి ఒక్కరు అవగాహనతో వ్యవహరించాలన్నారు. గృహ, వాణిజ్య, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులంతా పొదుపు పాటించాలన్నారు. డైరెక్టర్(ఆపరేషన్స్) రమేశ్‌కుమార్, సీజీఎం విజయలలిత, ఎస్‌ఈ ఏవీ సూర్యప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.