తీరప్రాంత సబ్స్టేషన్లలో గ్యాస్ ఇన్సులేషన్
ABN , First Publish Date - 2020-12-01T06:12:28+05:30 IST
ఈపీడీసీఎల్ అధికారులు తీర ప్రాంత సబ్స్టేషన్లలో ప్రమాదాల నివారణకు కొత్తగా గ్యాస్ ఇన్సులేషన్ చేస్తున్నారు.

అవుటర్ హార్బర్‌ను తనిఖీ చేసిన డైరెక్టర్
విశాఖపట్నం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఈపీడీసీఎల్ అధికారులు తీర ప్రాంత సబ్స్టేషన్లలో ప్రమాదాల నివారణకు కొత్తగా గ్యాస్ ఇన్సులేషన్ చేస్తున్నారు. పోర్టు అవుటర్ హార్బర్లో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌లో ఈ ఏర్పాట్లను ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాజబాపయ్య సోమవారం తనిఖీ చేశారు. తీరంలో గాలిలో తేమ వల్ల సాధారణ ఇన్సులేషన్ అయితే స్పార్క్‌లు వచ్చి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. అదే గ్యాస్(ఎస్ఎఫ్6) ఇన్సులేషన్ అయితే స్పార్క్ రాగానే అవి పెద్దది కాకుండా ఆపేస్తుంది. ప్రమాదాలను అరికడుతుంది. అందుకే వీటిని ఉపయోగిస్తునట్టు జోన్-1 ఈఈ మహేంద్రనాథ్ తెలిపారు. తీరంలో మొత్తం 10 సబ్స్టేషన్లలో గ్యాస్ ఇన్సులేషన్ చేయనున్నట్టు వెల్లడించారు. అదే విధంగా భూగర్భ కేబుల్ వ్యవస్థలో లోపం ఏర్పడితే... కేబుల్ ఫాల్ట్ లొకేటర్ ద్వారా దానిని గుర్తించి, సరిచేసే విధానాన్ని కూడా డైరెక్టర్ రాజబాపయ్య ఈ సందర్భంగా పరిశీలించారు. ఆ తరువాత పెదవాల్తేరు 132కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విశాఖ సర్కిల్ ఎస్ఈ సూర్యప్రతాప్, ఈఈ మహేంద్రనాధ్, యూజీ కేబుల్ ఈఈ టీఎస్ఎన్ మూర్తి, కన్స్ట్రక్షన్స్ ఈఈ దైవప్రసాద్ పాల్గొన్నారు.