మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

ABN , First Publish Date - 2020-12-07T05:47:48+05:30 IST

మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమని అనకాపల్లి గ్రీన్‌క్లబ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
మొక్కలు నాటుతున్న దృశ్యం

కశింకోట, డిసెంబరు 6: మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమని అనకాపల్లి గ్రీన్‌క్లబ్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. మండలంలోని తేగాడ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఆదివారం వారు మొక్కలు నాటారు. ఆవరణలో పచ్చదనం పెంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. పాఠశాల ప్రత్యేకాధికారి అన్నపూర్ణ, గ్రీన్‌క్లబ్‌ ప్రతినిధి కొణతాల ఫణిభూషణ్‌ శ్రీధర్‌, విశ్రాంత అటవీశాఖ రేంజర్‌ బి.వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-07T05:47:48+05:30 IST