ఆటోనగర్‌ అభివృద్ధికి కృషి: జీవీఎంసీ కమిషనర్‌

ABN , First Publish Date - 2020-12-25T05:31:28+05:30 IST

ఆటోనగర్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని జీవీఎంసీ కమిషనర్‌ సృజన హామీ ఇచ్చారు.

ఆటోనగర్‌ అభివృద్ధికి కృషి: జీవీఎంసీ కమిషనర్‌
ఆటోనగర్‌లో పర్యటిస్తున్న జీవీఎంసీ కమిషనర్‌ సృజన

ఆటోనగర్‌, డిసెంబరు 24: ఆటోనగర్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని జీవీఎంసీ కమిషనర్‌ సృజన హామీ ఇచ్చారు. ఐలా కమిషనర్‌ శామ్యూల్‌ అభ్యర్థన మేరకు గురువారం సాయంత్రం  ఆటోనగర్‌లోని పలు ప్రాంతాలలో ఆమె పర్యటించారు. శ్రీనగర్‌ నుంచి ఆటోనగర్‌ ఐలా ఆర్చి వరకూ రహదారి,  డి బ్లాకులోని అన్న క్యాంటీన్‌ పక్కన ఉన్న చెత్త డంపింగ్‌ యార్డును, అసంపూర్తిగా నిలిచిపోయినా చుక్కవానిపాలెం రైల్వే గేటు ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని పరిశీలించారు. పారిశుధ్యం నిర్వహణపై ఐలా అనుసరిస్తున్న విఽధానాలను తెలుసుకున్నారు. చెత్త సేకరణకు పలు బ్లాకులలో ఏర్పాటు చేసిన డంపర్‌ బిన్‌లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూ చించారు. పారిశ్రామిక వ్యర్థాలను ఇష్టానుసారం వేయకూడదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఐలా కమిషనర్‌ శా మ్యూల్‌ మాట్లాడుతూ రహదారుల ఆధునికీకరణ, పారిశుధ్యం నిర్వహణ, వసతుల రూప కల్పనకు జీవీఎంసీ సహకరించాలన్నారు. ఇందుకోసం సుమారు రూ.11 కోట్లు ఖర్చవుతోందన్నారు. ఈ వ్యయాన్ని ఐలాకు కేటాయించాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా మినీ కంపోస్ట్‌ యంత్రం, బాబ్‌క్యాట్‌ ఎక్విప్‌మెంట్‌లను అందించాలన్నారు. పరిశ్రమలకు  రక్షిత మంచి నీటి వసతి కల్పించాలని కోరారు.  ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువవడంతో ప్రమాదాల నివారణకు 5 కిలోమీటర్ల మేర రహదారిని సెంటర్‌ డివైడర్లతో ఆధునికీకరించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో గాజువాక జోనల్‌ కమిషనర్‌ శ్రీధర్‌, వాసి వా అధ్యక్షుడు ఏకే బాలాజీ, ఐలా పూర్వ చైర్మన్లు శేషగిరిరావు, సాంబశివరావు, చీకటి సత్యనారాయణ తదితరులున్నారు.

Updated Date - 2020-12-25T05:31:28+05:30 IST