వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించండి

ABN , First Publish Date - 2020-06-18T09:32:47+05:30 IST

జీవీఎంసీ పరిధిలో సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వార్డు ప్రత్యేక అధికారులపైనే ఉందని

వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించండి

జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు 


విశాఖపట్నం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ పరిధిలో సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వార్డు ప్రత్యేక అధికారులపైనే ఉందని జీవీఎంసీ అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు తెలిపారు. వార్డు ప్రత్యేక అధికారులు, ప్రజారోగ్య విభాగం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలతోపాటు దోమల నివారణపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు వీలుగా చర ్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రై డే పాటించడం, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడడం, దోమ లార్వాను నిర్వీర్యం చేయడంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కేఎల్‌ఎస్‌జీ శాస్త్రి, బయాలజిస్టు పైడిరాజు, కన్సల్టెంట్‌ జీవీవీఎస్‌మూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-18T09:32:47+05:30 IST