కార్మికులకు చట్టబద్ధంగా అన్యాయం చేయొద్దు
ABN , First Publish Date - 2020-12-17T06:16:18+05:30 IST
కేంద్ర ప్రభు త్వం అమల్లోకి తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టా లను తక్షణం రద్దు చేయాలని, రైల్వే ప్రైవేటీ కరణ యోచన విరమించుకోవాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.కె.పట్సహాని పిలుపునిచ్చారు.

ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.కె.పట్సహాని
44 చట్టాలు నాలుగుగా మార్చడంలోనే మతలబు అంతా
దొండపర్తి, డిసెంబరు 16: కేంద్ర ప్రభు త్వం అమల్లోకి తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టా లను తక్షణం రద్దు చేయాలని, రైల్వే ప్రైవేటీ కరణ యోచన విరమించుకోవాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ప్రధాన కార్యదర్శి పి.కె.పట్సహాని పిలుపునిచ్చారు. శ్రామిక యూనియన్ డివిజినల్ కోఆర్డినేటర్ బి.దామోదరరావు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం డీఆర్‌ఎం ఆఫీసు వెనుక యూనియన్ కార్యాలయంలో జోనల్ సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పి.కె.పట్సహాని మాట్లా డుతూ 44 చట్టాలను నాలుగుగా మార్చడంవల్ల కార్మికులకు ఎంతో నష్టమన్నారు. డివిజినల్ కో ఆర్డినేటర్ దామోదరరావు మాట్లాడుతూ స్వచ్ఛంద విరమణ చేసే వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్మికుల హక్కులు పరిరక్షించాలని కోరారు.
ఈ కార్య క్రమంలో జోనల్ కార్యదర్శి ఎస్.కె.పండా, డివిజి నల్ కోఆర్డినేటర్ దాస్ (ఖుర్దారోడ్డు), సునీల్ కుమార్ (సంబల్‌పూర్), డిప్యూటీ డివిజినల్ కో ఆర్డినేటర్‌లు ఎస్.కె.పాడి (వాల్తేరు), సాడంగి (ఖుర్దా రోడ్డు), ఆయా డివిజన్ల ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, కోశాధికారులు, కేంద్ర నిర్వాహకసభ్యులు పాల్గొన్నారు.