ప్రతీ పీహెచ్‌సీని టీబీ పరీక్షా కేంద్రంగా మార్చాం
ABN , First Publish Date - 2020-12-20T05:59:49+05:30 IST
ప్రతీ పీహెచ్‌సీని టీబీ (క్షయ) పరీక్షా కేంద్రంగా తీసుకొచ్చామని జిల్లా క్షయ నివారణాధికారిణి డాక్టర్ ఎన్ వసుంధర తెలిపారు.

ట్రూనాట్, సీబీనాట్, మైక్సోస్కోపిక్ పద్ధతుల్లో క్షయ పరీక్షలు
జిల్లా క్షయ నివారణాధికారిణి వసుంధర
సీలేరు, డిసెంబరు 19: ప్రతీ పీహెచ్‌సీని టీబీ (క్షయ) పరీక్షా కేంద్రంగా తీసుకొచ్చామని జిల్లా క్షయ నివారణాధికారిణి డాక్టర్ ఎన్ వసుంధర తెలిపారు. శనివారం సీలేరు పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆమె స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ.. క్షయ పరీక్షల కోసం ట్రూనాట్, సీబీనాట్, మైక్రోస్కోపిక్ వంటి మూడు పద్ధతుల ద్వారా అన్ని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 3,290 టీబీ కేసులు ఉన్నాయని, జిల్లా ప్రతీ పీహెచ్‌సీకి నెలకు కనీసం 15 మందికైనా టీబీ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో ప్రతీ నెల 100 నుంచి 120 వరకు కేసులు నమోదవుతున్నాయని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా సీలేరు, ధారకొండ, సప్పర్ల పీహెచ్‌సీలో సిబ్బందితో సమావేశమై క్షయ వ్యాధి పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సప్పర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి ఎల్. పవన్‌ప్రశాంత్, హెచ్‌ఎస్ త్రినాథ్, హెల్త్ అసిస్టెంట్‌లు రాజు, సత్యనారాయణ పాల్గొన్నారు.