జెన్‌కో ఇంజనీర్లబృందం డంపింగ్‌ ప్రదేశాల పరిశీలన

ABN , First Publish Date - 2020-03-02T10:15:08+05:30 IST

డంపింగ్‌ ప్రదేశాల కోసం ఏపీ జెన్‌కో ఇన్వెస్ట్‌గేషన్‌ అధికారులు, వ్యాప్కోస్‌ సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్ల బృందం ఆదివారం పర్యటించి సీలేరులో ఖాళీగా ఉన్న పలు

జెన్‌కో ఇంజనీర్లబృందం డంపింగ్‌ ప్రదేశాల పరిశీలన

  • డంపింగ్‌ ప్రదేశాలను పరిశీలిస్తున్న ఏపీ జెన్‌కో ఇన్వె్‌స్టగేషన్‌ అధికారుల బృందం

సీలేరు: డంపింగ్‌ ప్రదేశాల కోసం ఏపీ జెన్‌కో ఇన్వెస్ట్‌గేషన్‌ అధికారులు, వ్యాప్కోస్‌ సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్ల బృందం ఆదివారం పర్యటించి సీలేరులో ఖాళీగా ఉన్న పలు ప్రదేశాలను పరిశీలించారు. రూ.ఐదు వేల కోట్లతో సీలేరులో నూతనంగా నిర్మించతలపెట్టిన రివర్స్‌ పంపింగ్‌(ఎత్తిపోతల) జలవిద్యుత్‌ ప్రాజెక్టు సర్వే పనులు తుది దశకు చేరుకున్న విషయం విదితమే.  ఈ ప్రాజెక్టు పూర్తిగా భూగర్భం (అండర్‌ గ్రౌండ్‌)లో నిర్మించే ప్రాజెక్టు కావడంతో అండర్‌ గ్రౌండ్‌లో తవ్వకాల వల్ల వచ్చే మట్టి,రాయి వంటి వాటిని సీలేరులో ఖాళీగా ఉండే ప్రదేశాల్లో డంపింగ్‌ చేయడానికి ఏఏ ప్రదేశాలు అనకూలంగా ఉంటాయి, సీలేరులో ఖాళీగా ఉన్న ప్రదేశాలు సరిపోతాయా? లేక అదనంగా సీలేరు పరిసరాల్లో ఉన్న అటవీశాఖ భూములు ఏమైనా అవసరం పడతాయా? అనే దిశగా ఈ బృందం పలు ప్రదేశాలను పరిశీలించింది. ఈ మేరకు సీలేరులో ఏపీ జెన్‌కో ఆధీనంలో గల వివిధ ఖాళీ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీ జెన్‌కో ఈఈ వీఎల్‌ రమేష్‌ మాట్లాడుతూ ఈనెలలో ఏపీ జెన్‌కో సీఎండీతో సీలేరు రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టుపై సమగ్ర నివేదికను అందించాల్సి ఉన్న నేపథ్యంలో సర్వే నివేదికతో పాటు డంపింగ్‌కు ఎంత ఖాళీ స్థలాలు అవసరమో అవి సీలేరులో జెన్‌కో స్థలం ఉందా? లేక ఏమైనా స్థలం అటవీ శాఖ నుంచి తీసుకోవాలా అనే సమాచారం నివేదించాల్సి ఉన్నందున ఏపీ జెన్‌కో సివిల్‌ విభాగానికి చెందిన ఇన్వె్‌స్టగెషన్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ శ్రీరామ్‌రెడ్డి, వ్యాప్కోస్‌ సంస్థ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ విఎ్‌సఎన్‌ రాజన్‌, ఏఈ చంద్రశేఖర్‌ బృందంతో  పాటు స్థానిక స్థలాలను పరిశీలించారని  తెలిపారు.

Updated Date - 2020-03-02T10:15:08+05:30 IST