-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Duduma
-
డుడుమ డ్యామ్‌లో జారిపడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-11-27T06:06:29+05:30 IST
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని డుడుమ డ్యామ్‌లో పడి ఒడిశాకు చెందిన గురుదొర (30) అనే యువకుడు మృతి చెందాడు.

ముంచంగిపుట్టు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని డుడుమ డ్యామ్‌లో పడి ఒడిశాకు చెందిన గురుదొర (30) అనే యువకుడు మృతి చెందాడు. కోరాపుట్టు జిల్లా కురసాపడా గ్రామానికి చెందిన గురుదొర బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. ఈ నేపథ్యంలో గురువారం డుడుమ డ్యామ్‌లో శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తూ కాలుజారి డ్యామ్‌లో పడిఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మాచ్‌ఖండ్ ఎస్‌ఐ ప్రపుల్లా లక్రా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.