రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టండి
ABN , First Publish Date - 2020-12-18T05:24:42+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి పిలుపునిచ్చారు.

పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన
కశింకోట, డిసెంబరు 17: రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి పిలుపునిచ్చారు. కొత్తపల్లి గ్రామంలో గురువారం టీడీపీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. తుఫాన్ కారణంగా పంటలను కోల్పోయి రైతులు నష్టపోయినా, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు అర్ధాకలితో అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఆయన సూచించారు. అనంతరం రమణమూర్తిని టీడీపీ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బుదిరెడ్డి గంగయ్య, కలగా సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.