ఘనంగా ద్రోణంరాజు సత్యనారాయణ వర్ధంతి

ABN , First Publish Date - 2020-12-29T05:35:52+05:30 IST

దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ వర్ధంతిని సోమవారం సిరిపురంలోని ద్రోణంరాజు సర్కిల్‌ వద్ద ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ద్రోణంరాజు సత్యనారాయణ వర్ధంతి
ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి నివాళులర్పిస్తున్న శ్రీవత్సవ్‌, తదితరులు

సిరిపురం, డిసెంబరు 28: దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ వర్ధంతిని సోమవారం సిరిపురంలోని ద్రోణంరాజు సర్కిల్‌ వద్ద ఘనంగా నిర్వహించారు. ద్రోణంరాజు సత్యనారాయణ కాంస్య విగ్రహానికి ఆయన మనవుడు ద్రోణంరాజు శ్రీవత్సవ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్‌, పంచకర్ల రమేశ్‌బాబు, వైసీపీ నాయకులు కొండా రాజీవ్‌గాంధీ, పీఎస్‌ఎన్‌ రాజు, బెహరా భాస్కరరావు, రవిరెడ్డి, ఫాతిమారాణి, పొలిపిల్లి జ్యోతి, చెరువు రామకోటయ్య, తదితరులు పాల్గొన్నారు.


మధరవాడలో..

మధురవాడ: దివంగత నేత ద్రోణంరాజు సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా చంద్రంపాలెం లేఅవుట్‌లోని కల్యాణ మండపం వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి పలువురు నివాళులర్పించారు. కార్యక్రమంలో సూరిబాబు, కృష్టమూర్తిపాత్రుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:35:52+05:30 IST