కరోనా సమయంలో పాదయాత్రలు సరికాదు

ABN , First Publish Date - 2020-11-14T05:00:55+05:30 IST

కరోనా సమయంలో ప్రభుత్వం పాఠశాలలు తెరవడం, అధికార పార్టీ నాయకులు పాదయాత్రలు నిర్వహించడం సరికాదని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్డమూరి కృష్ణస్వరూప్‌ అన్నారు.

కరోనా సమయంలో పాదయాత్రలు సరికాదు
మాట్లాడుతున్న కృష్ణస్వరూప్‌

  డీబీపీ జాతీయ అధ్యక్షుడు  కృష్ణస్వరూప్‌

పాయకరావుపేట, నవంబరు 13 : కరోనా సమయంలో ప్రభుత్వం పాఠశాలలు తెరవడం, అధికార పార్టీ నాయకులు పాదయాత్రలు నిర్వహించడం సరికాదని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్డమూరి కృష్ణస్వరూప్‌ అన్నారు. శుక్రవారం ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ శీతాకాలంలో   వైరస్‌ వాప్తి చెందనున్న సమయంలో రాష్ట్రంలో పాఠశాలలు తెరవడం, అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించడం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడడమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి ప్రజలు కరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-11-14T05:00:55+05:30 IST