పిచ్చికుక్క దాడిలో తొమ్మిది మందికి గాయాలు
ABN , First Publish Date - 2020-11-26T06:20:16+05:30 IST
వడ్డాదిలో బుధవారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి తొమ్మిది మందిని గాయపరిచింది.

బుచ్చెయ్యపేట: వడ్డాదిలో బుధవారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి తొమ్మిది మందిని గాయపరిచింది. బాధితులు వడ్డాదికి చెందిన ఎ.వెంకటేశ్వరరావు, ఎన్.జీవన్, ఎం.అశ్వనికుమారి, కె.సురేశ్, ఆర్.హేమామాలిని, ఈ.నారాయణరావు, వి.యరామరాజుపేటకు బి.జగన్నాథరావు, దేవరాపల్లికి చెందిన అల్లం రఘు, ఎల్బిపీ.అగ్రహారానికి చెందిన బి.శ్రీనివాసరావు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వీరికి వైద్యాధికారి శంకుతల చికిత్సలు చేశారు.