-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Do not harvest until the rains subside
-
వర్షాలు తగ్గే వరకు వరికోతలు వద్దు
ABN , First Publish Date - 2020-11-27T05:50:27+05:30 IST
నివర్ తుఫాన్ తీరందాటి వాయుగుండంగా బలహీనపడినప్పటికీ రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున వరి పంట రక్షణకు చర్యలు తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నవీన్ జ్ఞానమణి అన్నారు.

వర్షాలు తగ్గే వరకు వరికోతలు వద్ద అత్యవసరమైతే కంబైన్డ్ హార్వెస్టర్ వినియోగించండి
వ్యవసాయ శాఖ ఏడీ నవీన్ జ్ఞానమణి
చింతపల్లి, నవంబరు 26: నివర్ తుఫాన్ తీరందాటి వాయుగుండంగా బలహీనపడినప్పటికీ రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున వరి పంట రక్షణకు చర్యలు తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నవీన్ జ్ఞానమణి అన్నారు. వర్షాలు తగ్గే వరకు వరి కోతలను వాయిదా వేసుకోవాలని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కోతలు కోయాల్సి వస్తే కంబైన్డ్ హర్వేస్టర్ యంత్రంతో కోత కోసి, ధాన్నాన్ని వర్షం పడనిచోట గాలి, వెలుతురు తగిలేలా ఆరబెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికే కోత కోసి ఉన్న వరి పనలను మెరక ప్రదేశాలకు తరలించి, 10 కిలోల కళ్లు ఉప్పును 200 లీటర్ల నీటిలో కలిపి వరి కంకులు(ఎకరా వరి పనలకు) తడిసేలా పిచికారీ చేయాలన్నారు.
ఏజెన్సీలో నేడు భారీ వర్షాలు
తుఫాన్ ప్రభావం వల్ల ఏజెన్సీలో గురువారం రాత్రి నుంచే వర్షం పెరుగుతుందని, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ డాక్టర్ రామారావు గురువారం విడుదల చేసిన వాతావరణ సమాచారంలో పేర్కొన్నారు. గరిష్ఠంగా 90 ఎం.ఎం. వరకు వర్షపాతం నమోదవుతుందని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, గెడ్డ వాలుల్లో పంటలను సాగు చేస్తున్న రైతులు పంటలు ముంపుబారిన పడకుండా తగు చర్యలు చేపట్టాలని సూచించారు.