అక్రమంగా మరో వాహనంలోకి ఇసుక లోడింగ్‌

ABN , First Publish Date - 2020-09-16T08:59:21+05:30 IST

ఎండాడ-రుషికొండ మార్గంలో అక్రమంగా ఇసుకను లారీ నుంచి మరో వ్యాన్‌లోకి లోడ్‌ చేస్తుండగా మంగళవారం ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఎస్‌.చంద్రశే

అక్రమంగా మరో వాహనంలోకి ఇసుక లోడింగ్‌

అడ్డుకున్న పోలీసులు..రెండు వాహనాలు సీజ్


ఎండాడ, సెప్టెంబరు 15: ఎండాడ-రుషికొండ మార్గంలో అక్రమంగా ఇసుకను లారీ నుంచి మరో వ్యాన్‌లోకి లోడ్‌ చేస్తుండగా మంగళవారం ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఎస్‌.చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఒడిశా నుంచి ఎన్‌ఏడీ ప్రాంతానికి 30 టన్నుల ఇసుక లోడ్‌తో వెళ్లాల్సిన లారీ నుంచి ఎండాడలో మరో వాహనంలోకి ఇసుకను లోడ్‌ చేస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) పోలీసులు అడ్డుకున్నారు.


కాగా ఇసుకతో ఈ లారీ ఎన్‌ఏడీకి ఈనెల 13న చేరుకోవాల్సి ఉందన్నారు. ఈ రెండు వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు ఒడిశాకు చెందిన లారీడ్రైవర్‌, క్లీనర్‌ కొమ్మాది రంజాన్‌, పెంటయ్యర్‌ టున్నుతో పాటు మరో వాహనం డ్రైవర్‌ కొండపు రవిలను అదుపులోకి తీసుకుని పీఎంపాలెం పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-09-16T08:59:21+05:30 IST