విమ్స్‌లో సేవలు విస్తరించాలి

ABN , First Publish Date - 2020-08-18T11:41:52+05:30 IST

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌)లో సేవలు మరింత విస్తరించాలని జిల్లా కలెక్టర్‌ వి వినయ్‌ చంద్‌ అధికారులను ఆదేశించారు.

విమ్స్‌లో సేవలు విస్తరించాలి

జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌ చంద్‌


విశాఖపట్నం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి) : విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌)లో సేవలు మరింత విస్తరించాలని జిల్లా కలెక్టర్‌ వి వినయ్‌ చంద్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన విమ్స్‌ను సందర్శించి వైద్య సేవలు, వసతులను పరిశీలించారు. ఆసుపత్రి డైరెక్టర్‌, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. వార్డులను సీసీ టీవీ ఫుటేజ్‌ల ద్వారా పరిశీలించారు. ఆస్పత్రిలో అవసరమైన పరికరాలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీవీ సుధాకర్‌, విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యవరప్రసాద్‌, నోడల్‌ అధికారి సూర్యకళ, ఓఎస్‌డీ డాక్టర్‌ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-18T11:41:52+05:30 IST