పాడి రైతుల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-26T05:23:40+05:30 IST

మండలంలోని వంగలి, గొర్లివానిపాలెం, అంతకాపల్లి, మలునాయుడుపాలెం, ఎరుకునాయుడుపాలెం, నంగినారపాడు గ్రామాల్లో ఇటీవల పాడి రైతులు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులకు విశాఖ డెయిరీ డైరెక్టర్‌ శరగడం శంకరరావు శుక్రవారం బీమా చెక్కులు పంపిణీ చేశారు.

పాడి రైతుల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ
పాడి రైతు కుటుంబ సభ్యులకు బీమా చెక్కు పంపిణీ చేస్తున్న శరగడం శంకరరావు

సబ్బవరం, డిసెంబరు 25 : మండలంలోని వంగలి, గొర్లివానిపాలెం, అంతకాపల్లి, మలునాయుడుపాలెం, ఎరుకునాయుడుపాలెం, నంగినారపాడు గ్రామాల్లో ఇటీవల పాడి రైతులు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులకు విశాఖ డెయిరీ డైరెక్టర్‌ శరగడం శంకరరావు శుక్రవారం బీమా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మృతుల కుటుంబాలకు డెయిరీ రూ.30 వేలు బీమాగా అందజేసేదని, ఇప్పుడు లక్ష రూపాయలకు పెంచినట్టు తెలిపారు. రైతులు పాడి ఉత్పత్తిని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ మేనేజర్‌ ఏఆర్‌ ప్రభాకరరావు, సూపర్‌వైజర్లు బి. కమలాకరరావు, పి.గురుణాథరావు, ఆడారి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు బోను గంగునాయుడు, గొర్లి కనకరాజు, కొటాన దేముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T05:23:40+05:30 IST