డీడీల కోసం దూరవిద్య విద్యార్థుల పడిగాపులు
ABN , First Publish Date - 2020-12-30T05:27:09+05:30 IST
ఏయూ దూరవిద్య కేంద్రంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు ఈనెల 31తో గడువు ముగియనుండడంతో డీడీలు తీసేందుకు కేంద్రం ఆవరణలోని బ్యాంక్ వద్ద విద్యార్థులు బారులుతీరారు.
ఏయూ క్యాంపస్, డిసెంబరు 29: ఏయూ దూరవిద్య కేంద్రంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు ఈనెల 31తో గడువు ముగియనుండడంతో డీడీలు తీసేందుకు కేంద్రం ఆవరణలోని బ్యాంక్ వద్ద విద్యార్థులు బారులుతీరారు. డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఫీజు డీడీల కోసం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు గంటల తరబడి క్యూలో నిలిచారు. కొంతమంది మహిళలు పసిపాపలతో క్యూలో వేచివుండి డీడీలు తీశారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని బ్యాంకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పలువురు విద్యార్థులు కోరుతున్నారు. కాగా డీడీలు తీసిన విద్యార్థులు వాటిని ఇచ్చేందుకు దూరవిద్య కేంద్రంలో భౌతిక దూరం పాటించకుండా గుమిగూడారు. కాగా కరోనా దృష్ట్యా ఫీజు గడువును మరో 15 రోజులు పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.