అక్రమ నిర్మాణాలపై కొనసాగుతున్న స్పెషల్‌డ్రైవ్‌

ABN , First Publish Date - 2020-11-13T05:42:05+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చేపట్టిన స్పెషల్‌డ్రైవ్‌ గురువారం కూడా కొనసాగింది.

అక్రమ నిర్మాణాలపై కొనసాగుతున్న స్పెషల్‌డ్రైవ్‌
అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది

విశాఖపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు చేపట్టిన స్పెషల్‌డ్రైవ్‌ గురువారం కూడా కొనసాగింది. చీఫ్‌ సిటీప్లానర్‌ విద్యుల్లత ఆదేశాల మేరకు సీటీప్లానర్లు ఎ.ప్రభాకర్‌, డి.రాంబాబు ఆధ్వర్యంలో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది నగరంలో ప్లాన్‌ తీసుకోకుండా చేపడుతున్న నిర్మాణాలతోపాటు ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించినట్టు గుర్తించిన పది భవనాల నిర్మాణాలను కూల్చివేశారు. వీటిలో జోన్‌-1 పరిధిలో రెండు, జోన్‌-2 పరిధిలో రెండు, జోన్‌-3 పరిధిలో ఒకటి, జోన్‌-4 పరిధిలో మూడు, జోన్‌-5 పరిధిలో ఒకటి, జోన్‌-6 పరిధిలో నాలుగు భవనాల్లో ఉల్లంఘనలను గుర్తించి ఆ మేరకు కూల్చివేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని సీసీపీ విద్యుల్లత హెచ్చరించారు.


Updated Date - 2020-11-13T05:42:05+05:30 IST