-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Disasters caused by drugs
-
మాదక ద్రవ్యాల వల్ల అనర్థాలు
ABN , First Publish Date - 2020-12-20T05:09:25+05:30 IST
జీవీఎంసీ 79వ వార్డు పరిధి లంకెలపాలెం కూడలిలో శనివారం పరవాడ పోలీసులు మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఘనంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలు
లంకెలపాలెం, డిసెంబరు 19: జీవీఎంసీ 79వ వార్డు పరిధి లంకెలపాలెం కూడలిలో శనివారం పరవాడ పోలీసులు మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు డ్రైవర్లు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాలు సేవిస్తే జీవితాలు నాశనమవు తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మరిడిమాంబ ఆటో యూనియన్ ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెందుర్తిలో..
పెందుర్తి: పెందుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని స్థానిక కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ డి.శ్రీహరిరాజు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల జోలికిపోరాదని సూచించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్‌ఐ భరత్‌కుమార్‌రాజు పర్యవేక్షణలో విద్యా ర్థులు నో డ్రగ్ ఆకృతిలో కూర్చున్నారు. యాంటీ డ్రగ్ బ్యానర్లు ప్రదర్శించి మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.