-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » dig visit to armed reserve police station
-
ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డీఐజీ
ABN , First Publish Date - 2020-12-30T05:33:46+05:30 IST
కైలాసగిరి ప్రాంతంలోని జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ కార్యాలయాన్ని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కే రంగారావు మంగళవారం సందర్శించారు.

విశాలాక్షినగర్, డిసెంబరు 29: కైలాసగిరి ప్రాంతంలోని జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ కార్యాలయాన్ని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కే రంగారావు మంగళవారం సందర్శించారు. సంవత్సరాంతపు తనిఖీల్లో భాగంగా ఇక్కడకు వచ్చిన ఆయన కైలాసగిరి రిజర్వ్ మైదానంలో సిబ్బంది నుంచి డీఐజీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాకు చెందిన బ్రహ్మశ్రీ లక్ష్మణానంద గురూజీ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. సిద్ధ యోగం గురించి రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వివరిస్తూ... దైనందిన జీవితంలో వాటిని పాటించడం వల్ల కలిగే ఉపయోగాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ రాహూల్‌దేవ్ సింగ్, ఎస్.అప్పలనాయుడు, శాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు.