కరోనాపై నిర్లక్ష్యం వద్దు

ABN , First Publish Date - 2020-11-26T04:56:49+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో వాటిని టీకా వచ్చేంతవరకు ప్రజలంతా పాటించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు సూచించారు.

కరోనాపై నిర్లక్ష్యం వద్దు

టీకా వచ్చేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు

వెంకోజీపాలెం, నవంబరు 25: కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో వాటిని టీకా వచ్చేంతవరకు ప్రజలంతా పాటించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు సూచించారు. మన ఆరోగ్య సంరక్షణ మన చేతుల్లోనే ఉందని, అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో చాలామంది ఇతరుల సంరక్షణను విస్మరించి మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా సంచరిస్తున్నారన్నారు. కొందరు వాహనదారులతో పాటు ప్రజలు నోరు, ముక్కు కప్పి ఉంచేలా మాస్కు కట్టుకోకుండా అలంకారప్రాయంగా తగిలించుకోవడం కరోనా మహమ్మారిని ఆహ్వానించడమే అవుతుందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు పోలీస్‌ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇందులో భాగంగా ప్రతీ సోమవారం ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు విశాఖ రే ంజ్‌ పరిధిలోని మూడు జిల్లాల ప్రజల కోసం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమాన్ని తమ కార్యాలయంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా 0891-2754535 నంబర్‌కు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించుకోవాల్సిందిగా రంగారావు కోరారు.

Updated Date - 2020-11-26T04:56:49+05:30 IST