ధనుర్మాసోత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-17T05:54:13+05:30 IST

ఉపమాక వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రంలో బుధవారం ధను ర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి.

ధనుర్మాసోత్సవాలు ప్రారంభం
ఉపమాక ఆలయంలో నెలగంట పెడుతున్న వరప్రసాదాచార్యులు

నక్కపల్లి, డిసెంబరు 16 : ఉపమాక వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రంలో బుధవారం ధను ర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేకువజాము 5.30 గంటలకు ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు నెల గంటతో ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాలు ఏకాంతంగా జరుపుతామని చెప్పారు. 25న ముక్కోటి ఏకాదశి, భోగి పండుగ రోజున  గోదారంగనాయక కల్యాణం, కనుమ పండుగరోజున జరగాల్సిన గిరి ప్రదక్షిణోత్సవాలను కూడా రద్దు చేశామన్నారు. అర్చకులు గోపీ, రంగా, సాయి తదితరులు పాల్గొన్నారు.

పాయకరావుపేటలో..

పాయకరావుపేట : పట్టణంలోని రాధారుక్మిణి సహిత పాండురంగ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఏకాంతంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఈ ఏడాది ఏకాంతంగా వేడుకలు నిర్వహిస్తున్నట్టు ప్రధానార్చకులు యి.కృష్ణస్వామి తెలిపారు. తొలుత స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. ఆలయ ఈవో పీఎల్‌ఎన్‌ రాజుతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T05:54:13+05:30 IST