ప్రభుత్వ భూమి లే అవుట్‌గా అభివృద్ధి

ABN , First Publish Date - 2020-12-29T05:51:18+05:30 IST

పట్టణంలోని రైల్వే పట్టాల అవతల దళిత కాలనీలను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు దళిత నాయకులు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ భూమి లే అవుట్‌గా అభివృద్ధి

 ఆక్రమణను అడ్డుకోవాలని దళిత నాయకులు తహసీల్దార్‌కు వినతి 

పాయకరావుపేట, డిసెంబరు 28 : పట్టణంలోని రైల్వే పట్టాల అవతల దళిత కాలనీలను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు దళిత నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజీవ్‌నగర్‌కాలనీ, దుర్గాకాలనీ, అంబేడ్కర్‌ కాలనీలకు చెందిన పలువురు దళిత నాయకులు సోమవారం తహసీల్దార్‌ అంబేడ్క ర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జెడ్పీటీసీ అభ్యర్థి కువల కుమార్‌, ఇంజరపు సూరిబాబు మాట్లాడుతూ తాము నివాసముంటున్న కాలనీలు, రైల్వే పట్టాలను ఆనుకుని ఉన్న సర్వే నంబరు 58/4లోని ఎకరా భూమితో పాటు పక్కనే ఉన్న సుమారు అర ఎకరి ప్రభుత్వ భూమిని కొంతమంది లేఅవుట్‌గా అభివృద్ధి చేస్తున్నారని ఆరోపించారు. పైగా పక్కనే ఉన్న పోలవరం ఎడమ కాలువలో భాగంగా తవ్విన గ్రావెల్‌ను  లేఅవుట్‌ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారన్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.  దళిత నాయకులు  బాల, సింహాచలం, బీరా కుమారి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T05:51:18+05:30 IST