సబ్బవరంలో అభివృద్ధి శూన్యం
ABN , First Publish Date - 2020-12-31T05:02:35+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శిం చారు.

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శ
సబ్బవరం, డిసెంబరు 30: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శిం చారు. బుధవారం ఇరువాడలో విలేఖరులతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో మండలానికి రూ.3.2 కోట్లతో తీసుకొచ్చిన మినరల్ వాటర్‌ప్లాంట్‌ను మూలకు చేర్చారని, రూ.24 కోట్లతో చేపట్టిన సబ్బ వరం మేజరు పంచాయతీ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిలిపి వేశారని విమర్శించారు. సబ్బవరం- గుల్లేపల్లి రోడ్డుకు రూ.6 కోట్లు మంజూరైనా నిధులు తీసుకురాలేకపోయారన్నారు. స్కిల్డ్ డెవలప్ మెంట్ వర్సిటీకి వంగలిలో 120 ఎకరాలు కేటాయిస్తే ఆ పనులు నిలిపేశారన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా అభివృద్ధి పనులు కొనసాగించాలని హితవు పలికారు. టీడీపీకి మంచి పేరు వస్తుందనే ఈ పనులన్నీ నిలిపివేశారని ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే సబ్బవరానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ ఒక నేత చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. ఈ సమస్యలపై త్వర లోనే పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో మిడతాడ మహాలక్ష్మీ నాయుడు, బి.బాబూరావు, కె.అప్పారావు, బి.సత్యారావు, బుచ్చిరాజు, ప్రకాశ్, తాతారావు, శ్రీను,దేముడు, ప్రసాద్,అప్పారావు, నానాజీ, తదితరులు పాల్గొన్నారు.