రైతులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన

ABN , First Publish Date - 2020-12-17T06:18:59+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ సీపీఐ ఆఽధ్వర్యంలో బుధవారం సుజాతనగర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

రైతులకు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన
కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తున్న దృశ్యం

పెందుర్తి, డిసెంబరు 16: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావం తెలుపుతూ సీపీఐ ఆఽధ్వర్యంలో బుధవారం సుజాతనగర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నా యకులు ఆర్‌.శ్రీనివాస్‌, వై.త్రినాథ్‌, యెరిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 


పరవాడలో...

పరవాడ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న రైతుల పోరాటానికి మద్దతుగా సిటూ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మండల పరిషత్‌ జంక్షన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ీసిటూ జిల్లా నాయకుడు వీవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టే రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో సిటూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, ఎం.ఉమా దేవి, బి.రమణమ్మ, పోతల రమాదేవి, వరక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-17T06:18:59+05:30 IST