ఏఎల్‌పురం శివాలయంలో లక్ష దీపారాధన

ABN , First Publish Date - 2020-12-13T06:16:36+05:30 IST

కార్తీక మాసం సందర్భంగా ఏఎల్‌పురం శివారులో గల శివాలయంలో శనివారం రాత్రి లక్ష దీపారాధన అత్యంత వైభవంగా జరిగింది.

ఏఎల్‌పురం శివాలయంలో లక్ష దీపారాధన
లక్షదీ పాల వెలుగులో శివాలయం

కృష్ణాదేవిపేట, డిసెంబరు 12 : కార్తీక మాసం సందర్భంగా ఏఎల్‌పురం   శివారులో గల శివాలయంలో శనివారం రాత్రి లక్ష దీపారాధన అత్యంత వైభవంగా జరిగింది.  పాతకృష్ణాదేవిపేట, ఏఎల్‌పురం, వలసంపేట, చోద్యం, లింగంపేట, సీహెచ్‌.నాగాపురం, విప్పలపాలెం, మల్లంపేట తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై త్రిశూలం, లింగాకారం, ఓంకారం ఆకారాల్లో దీపాలను వెలిగించారు. ఈ ఆలయంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తపస్సు చేసినట్టు ప్రచారంలో ఉండడంతో ఏటా ఇక్కడ కార్తీకమాసం వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. 

Updated Date - 2020-12-13T06:16:36+05:30 IST