కలెక్టరేట్ వద్ద డీఎడ్ విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2020-11-03T06:08:35+05:30 IST
డిప్లొమా ఇన్‌ఎడ్యుకేషన్(డీఎడ్) మేనే జ్‌మెంట్ కోటా విద్యార్థులు తమకు పరీక్షలు నిర్వహించా లని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
మహారాణిపేట: డిప్లొమా ఇన్‌ఎడ్యుకేషన్(డీఎడ్) మేనే జ్‌మెంట్ కోటా విద్యార్థులు తమకు పరీక్షలు నిర్వహించా లని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీగా కలె క్టరేట్‌కు వెళ్లి ఆందోళన అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థు లు మాట్లాడుతూ ఏటా పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వ హించినా, ఈ ఏడాది విస్మరించారన్నారు. జీవో నంబర్ 30 గురించి కళాశాలల యాజమాన్యాలు ముందుగా తమకు తెలియజేయక పోవడంతో 2018లో డీఎడ్ కోర్సుల్లో జా యిన్ అయ్యామని, ఇప్పుడు పరీక్షలు నిర్వహించకుంటే వి లువైన రెండేళ్ల కాలాన్ని,ఖర్చులూ నష్టపోతామని తెలిపా రు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.