ట్రాలర్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-01T06:07:29+05:30 IST

ఎంవీపీ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొత్తవెంకోజీపాలెం ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే ప్రాంతానికి చెందిన మేడిశెట్టి నాగ ఉదయ భాస్కర్‌ (47) అనే వ్యక్తి మృతి చెందాడు.

ట్రాలర్‌ ఢీకొని వ్యక్తి మృతి
ట్రాలర్‌ కింద నాగ ఉదయభాస్కర్‌ మృతదేహం

ఎంవీపీ కాలనీ, నవంబరు 30: ఎంవీపీ జోన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి కొత్తవెంకోజీపాలెం ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే ప్రాంతానికి చెందిన మేడిశెట్టి నాగ ఉదయ భాస్కర్‌ (47) అనే వ్యక్తి మృతి చెందాడు. జోన్‌ సీఐ రమణయ్య కథనం ప్రకారం.. కొత్త వెంకోజీపాలేనికి చెందిన నాగ ఉదయభాస్కర్‌కు తన తండ్రి వెంకటసుబ్బయ్య ఫొన్‌ చేయడంతో ఉదయం ఐదున్నరప్పుడు మోటారు సైకిల్‌పై ఆయన ఇంటికి వెళ్లాడు. తండ్రిని మోటరు సైకిల్‌పై ఎక్కించుకుని కొత్తవెంకోజీపాలెం ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్దకు వచ్చేసరికి హనుమంతవాక నుంచి మద్దిలపాలెం వైపు వెళుతున్న ట్రాలర్‌ ఢీకొనడంతో నాగ ఉదయభాస్కర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటసుబ్బయ్య తలకు, కాళ్లకు తీవ్ర గాయలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్‌ ట్రాలర్‌లో ఇరుక్కుపోవడంతో నుజ్జునుజ్జయ్యింది. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ భాస్కరరావు పరిశీలించారు. మృతుడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మహిళా ఎస్‌ఐ లక్ష్మి తెలిపారు. 


Updated Date - 2020-12-01T06:07:29+05:30 IST