చెరువులో మునిగి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-11-20T05:24:50+05:30 IST

మండలంలోని పెద్దిపాలెం గ్రామంలోని గవిదిండ చెరువులో మునిగి గురువారం ఓ వ్యక్తి మృతి చెందినట్టు సీఐ వై.రవి తెలిపారు.

చెరువులో మునిగి వ్యక్తి మృతి
మృతుడు కోన అప్పలనారాయణ

ఆనందపురం, నవంబరు 19: మండలంలోని పెద్దిపాలెం గ్రామంలోని గవిదిండ చెరువులో మునిగి గురువారం ఓ వ్యక్తి మృతి చెందినట్టు సీఐ వై.రవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బీపీకళ్లాలు గ్రామానికి చెందిన కోన అప్పలనారాయణ (36) మేకలు మేపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం తన మేకలను తోలుకుంటూ సమీపంలో ఉన్న పెద్దిపాలెం దవిగిండి చెరువు గట్టుకు వెళ్లాడు. మేకల మేత కోసం కొమ్మలు కోస్తుండగా కందిరీగలు దాడి చేయడంతో వాటినుంచి తప్పించుకునేందుకు చెరువులో దిగాడు. అయితే చెరువు లోతు ఎక్కువగా ఉండడం.. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.


Updated Date - 2020-11-20T05:24:50+05:30 IST