బీపీఎస్‌కు 31 వరకూ గడువు

ABN , First Publish Date - 2020-12-01T05:51:58+05:30 IST

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌) పథకాన్ని డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

బీపీఎస్‌కు 31 వరకూ గడువు

విశాఖపట్నం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌) పథకాన్ని డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో ఇప్పటివరకూ బీపీఎస్‌కు 6,167 దరఖాస్తులు రాగా ఆరు వేల దరఖాస్తులకు సంబంధించిన భవనాలను క్రమబద్ధీకరించారు. తద్వారా జీవీఎంసీకి రూ.74 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన దరఖాస్తులను కూడా వచ్చే నెల రోజుల్లో క్లియర్‌ చేయాలని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Updated Date - 2020-12-01T05:51:58+05:30 IST