సహకార రంగంలో డెయిరీని విలీనం చేయాలి

ABN , First Publish Date - 2020-12-18T05:03:12+05:30 IST

విశాఖ డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో విలీనం చేసి కార్మికులను ఆదుకోవాలని విశాఖ డెయిరీ కాంట్రాక్టు కార్మిక సం ఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరిగిరి ధర్మారావు కోరారు.

సహకార రంగంలో డెయిరీని విలీనం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ధర్మారావు

అక్కిరెడ్డిపాలెం, డిసెంబరు 17: విశాఖ డెయిరీని రాష్ట్ర ప్రభుత్వం సహకార రంగంలో విలీనం చేసి కార్మికులను ఆదుకోవాలని విశాఖ డెయిరీ కాంట్రాక్టు కార్మిక సం ఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిరిగిరి ధర్మారావు కోరారు. అక్కిరెడ్డిపాలెంలో గురువారం జరిగిన సంఘం సమావేశంలో మాట్లాడుతూ విశాఖ డెయిరీలో  30 ఏళ్లుగా పర్మినెంట్‌ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నప్పటికీ వారికి యాజమాన్యం కనీస వేతనాలు, సౌకర్యాలు కల్పించకుండా శ్రమదోపిడీ చేస్తోందని ఆరోపించారు. సమావేశానికి సంఘం ప్రధాన కార్యదర్శి వరదాడ వెంకటరమణ అధ్యక్షత వహించగా, వి.గాంధీ, జి.మూర్తి, ఉరుకూటి శ్రీనివాసరావు, గోక సోములు, కుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T05:03:12+05:30 IST