-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » ctp asp
-
12 మంది మిలీషియా సభ్యులు లొంగుబాటు
ABN , First Publish Date - 2020-12-06T05:57:53+05:30 IST
మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పరిధిలోని 12 మంది మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారని చింతపల్లి ఏఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అన్నారు.

ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు
చింతపల్లి, డిసెంబరు 5: మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ పరిధిలోని 12 మంది మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారని చింతపల్లి ఏఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు అన్నారు. లొంగిపోయేందుకు వచ్చిన మిలీషియా సభ్యులకు ఏఎస్పీ పండ్లు అందజేసి జనజీవన స్రవంతిలో కలవాలని ఆహ్వానించారు. శనివారం సబ్‌డివిజన్ కార్యాలయంలో విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ.. పీఎల్‌జీఏ వారోత్సవాల సమయంలో మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోవడం శుభపరిణామన్నారు. ప్రస్తుతం గెమ్మెలి భాస్కర్‌రావు, మర్రి ప్రసాద్, గెమ్మెలి అర్జున్, నాగబాబు, కిముడు కామేశ్వరరావు, నాగేశ్వరరావు, నీలాంబర్, వంతల సుబ్బారావు, కొర్ర బాబురావు, కిల్లో చిన్నారావు, పాంగి నగేష్, కొర్ర సింగారం లొంగిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ 234, 42 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్లు పాపారావు, దేవీందర్ నాయుడు, ఎంఎల్ నాయుడు, జీకేవీధి సీఐ మురళీధర్, ఎస్‌ఐ అనీష్ పాల్గొన్నారు.