-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Crop insurance for 2971 farmers
-
2,971 మంది రైతులకే పంటల బీమా!
ABN , First Publish Date - 2020-12-15T06:36:03+05:30 IST
గత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 2,971 మంది రైతులకు పంటల బీమా వర్తించినట్టు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జీఎస్‌ఎన్‌ఎస్ లీలావతి తెలిపారు.

2019 ఖరీఫ్‌కు సంబంధించి రూ.2.11 కోట్లు విడుదల
విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 2,971 మంది రైతులకు పంటల బీమా వర్తించినట్టు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జీఎస్‌ఎన్‌ఎస్ లీలావతి తెలిపారు. పంట నష్టం వాటిల్లిన రైతులకు పరిహారంగా రూ.2.11 కోట్లు మంజూరయ్యాయన్నారు. పరిహారానికి ఎంపికైన రైతుల వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించామన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం రైతుల ఖాతాకు సొమ్ము జమ అవుతుందన్నారు. కాగా గత ఏడాది జిల్లాలో 1.93 లక్షల మంది రైతులకు చెందిన 1.16 లక్షల హెక్టార్ల పంటకు బీమా ప్రీమియం చెల్లించారు. అయితే పంట కోత ప్రయోగాల ఆధారంగా జిల్లాలో కేవలం 2,971 మంది రైతులకు మాత్రమే పరిహారం అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.