‘రొయ్యల చెరువులతో పంట పొలాలు నాశనం’

ABN , First Publish Date - 2020-11-20T05:22:51+05:30 IST

మండలంలోని వెంకటనగరంలో రొయ్యల చెరువుల వల్ల పంట పొలాలునాశనమవుతున్నాయని గ్రామానికి చెందిన రైతులు వంకా ప్రసాద్‌, చిట్టిబోయిన రాజు గురువారం ఆరోపించారు.

‘రొయ్యల చెరువులతో పంట పొలాలు నాశనం’
రొయ్యల చెరువుల వల్ల పాడైన పంట చూపుతున్న రైతులు

పాయకరావుపేట రూరల్‌, నవంబరు 19 : మండలంలోని వెంకటనగరంలో రొయ్యల చెరువుల వల్ల పంట పొలాలునాశనమవుతున్నాయని గ్రామానికి చెందిన రైతులు వంకా ప్రసాద్‌, చిట్టిబోయిన రాజు గురువారం ఆరోపించారు. పలువురు ఎటువంటి అనుమతులు లేకుండా చెరువులు తవ్వి, బోర్లు వేసి రొయ్యలను పెంచు తున్నారన్నారు. వ్యర్థ జలాలను బయటకు వదిలేయడంతో సమీ పంలోని పొలాల్లోకి  చేరి పంటలు నాశనమవుతున్నాయని వాపో యారు. అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించాల్సిందిగా కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-11-20T05:22:51+05:30 IST