తరగతులు నిర్వహిస్తే క్రిమినల్‌ చర్యలు

ABN , First Publish Date - 2020-03-23T09:23:51+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా నిరోధించేందుకు పాఠశాలలను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని, వీటిని ఉల్లంఘిస్తే సంబంధిత యాజమాన్యాలపై...

తరగతులు నిర్వహిస్తే క్రిమినల్‌ చర్యలు

  • పాఠశాలల యాజమాన్యాలకు డీఈఓ హెచ్చరిక


విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా నిరోధించేందుకు పాఠశాలలను మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేశామని, వీటిని ఉల్లంఘిస్తే సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి హెచ్చరించారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే ప్రైవేటు పాఠశాలలు పిల్లలకు సెలవులు ఇచ్చి ఉపాధ్యాయులను రప్పిస్తున్నాయన్నారు. జిల్లాలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీల పరిశీలనలో ఏదైనా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కనిపిస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2020-03-23T09:23:51+05:30 IST