బాలికపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2020-11-21T05:54:43+05:30 IST

ఓ బాలికపై అత్యాచారానికి యత్నించిన యువకుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

బాలికపై అత్యాచారయత్నం
నిందితుడు సతీశ్‌

పోలీసుల అదుపులో నిందితుడు

గాజువాక, నవంబరు 20: ఓ బాలికపై అత్యాచారానికి యత్నించిన  యువకుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. వాల్తేరు ఆర్టీసీ డిపోలో క్యాజువల్‌ మోటార్‌ మెకానిక్‌గా పనిచేస్తున్న సతీశ్‌ (27) గాజువాకలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం స్థానికంగా ఓ బాలిక (7)పై అత్యాచారయత్నానికి యత్నించాడు. ఇరుగుపొరుగు వాళ్లు గమనించి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని సతీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాజువాక పోలీస్‌ స్టేషన్‌కు దిశ స్టేషన్‌ ఏసీపీ ప్రేమకాజల్‌ చేరుకొని విచారణ జరిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. 


Read more