క్రికెట్‌ ట్రోపీని ఆవిష్కరించిన ఎంపీ

ABN , First Publish Date - 2020-11-28T05:07:36+05:30 IST

క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. సిరిపురంలోని ఓ హోటల్‌లో శుక్రవారం ఆయన కార్తీక్‌ రాహుల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వైజాగ్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ ట్రోఫీని ఆవిష్కరించారు.

క్రికెట్‌ ట్రోపీని ఆవిష్కరించిన ఎంపీ
ట్రోఫీని ఆవిష్కరిస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

డాబాగార్డెన్స్‌ , నవంబరు 27: క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. సిరిపురంలోని ఓ హోటల్‌లో శుక్రవారం ఆయన కార్తీక్‌ రాహుల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వైజాగ్‌ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. విశాఖలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఐపీఎల్‌ తరహాలో నిర్వహిస్తున్న లీగ్‌ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. క్రికెట్‌ అభిమానులకు ఇది పండుగని వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.  మూడు రాష్ట్రాల క్రీడాకారులు లీగ్‌లో పాల్గొంటారని, 25 రోజులు పోటీలు జరుగుతాయని నిర్వాహకుడు ఎం.రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో వంకాయల మారుతీప్రసాద్‌, శ్రీకాంత్‌, శ్రీనుబాబు, క్రీడాకారులు పాల్గొన్నారు.


Read more