-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Cricket Tourny
-
జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-11T04:45:50+05:30 IST
ఆర్మీ జవానుల దేశ సేవలను కీర్తిస్తూ ఇక్కడి ప్రభుత్వ జానియర్ కళాశాల మైదానంలో ‘జై జవాన్’ పేరిట జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ప్రారంభమైంది.

నర్సీపట్నం అర్బన్, డిసెంబరు 10 : ఆర్మీ జవానుల దేశ సేవలను కీర్తిస్తూ ఇక్కడి ప్రభుత్వ జానియర్ కళాశాల మైదానంలో ‘జై జవాన్’ పేరిట జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ప్రారంభమైంది. పట్టణ సీఐ స్వామినాయుడు ప్రారంభించి మాట్లాడారు. క్రీడల వల్ల ఐక్యతా భావం పెరుగుతుందన్నారు. జనవరి ఐదో తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.