-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » crd team visit
-
పథకాల అమలుపై సీఆర్‌డీ బృందం పరిశీలన
ABN , First Publish Date - 2020-12-06T06:19:19+05:30 IST
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, వాటి వలన చేకూరుతున్న లబ్ధితోపాటు ఉపాధి పథకం ద్వారా మరింత లబ్ధి చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై శనివారం మండలంలో సీఆర్‌డీ బృందం పరిశీలన జరిపింది.

కొయ్యూరు, డిసెంబరు 5: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు, వాటి వలన చేకూరుతున్న లబ్ధితోపాటు ఉపాధి పథకం ద్వారా మరింత లబ్ధి చేకూర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై శనివారం మండలంలో సీఆర్‌డీ బృందం పరిశీలన జరిపింది. కేంద్రం ఏర్పాటుచేసిన ఈ కమిటీలో రాష్ట్ర ప్రతినిధులు రోషిణి, బలరాంతో కూడిన బృందం శనివారం కొమ్మిక పంచాయతీ కిత్తలోవ, బట్టపణుకుల పంచాయతీలను సందర్శించింది. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారి ఆర్థిక స్థితిగతులతోపాటు ఉపాధి హామీ పథకం మరింత విస్తృత పరచి ప్రజలకు మరింత ఉపాధి కల్పనకు ఏ విధమైన పనులు నిర్వహించాలనే విషయాలపై బృందం ప్రజలతో చర్చించింది. ఈ బృందం వెంట ఉపాధి హామీ మండల ఏపీవో రాజు, సిబ్బంది పాల్గొన్నారు.